
తరించిపోనీ నీ ప్రేమలోనే -Tharinchiponi
తరించిపోనీ నీ ప్రేమలోనే
ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోనీ
నీ ప్రేమగీతం నే పాడుకోనీ
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా
ఉదయం రవికిరణం వరమై తాకనీ
మనసే మైమరచి నిను సేవించనీ
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ
కన్నులా రూపమే దీపమై వెలగనీ
చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా
వదనం నవకమలం నీతో సాగనీ
మధురం నీ చరితం నేనే పాడనీ
మోక్షమే జీవమై హాయిగా తాకనీ
యేసుతో ప్రాణమై సాగనీ పయనమే
కమ్మనీ గానమై దైవమా చేరెదా