దావీదు సుతునికి జయము – Dhaaveedhu Suthuniki
దావీదు సుతునికి జయము – Dhaaveedhu Suthuniki
Lyrics:-
దావీదు సుతునికి జయము జయం
స్తుతులు చెల్లించెదం
యెరూషలేముకు యేసుని రాక
ఆర్భాటముతో జరుగు వేడుక
స్వరమెత్తి పాడాలి విజయగీతిక
అ.ప. : హోసన్నా హోసన్నా హోసన్నా
ఓహో యేసన్నా మాయన్నా హోసన్నా
1. రాజుల రాజు సాత్వికుడై
నీతి సామ్రాజ్యపు స్థాపకుడై
ఏతెంచుచుండెను నీ యొద్దకు
ప్రవచనము నెరవేర్చుటకు
ప్రవచనములు నెరవేర్చుటకు
2. కట్టబడియున్న గాడిదను
విప్పి తోలుకుని తెమ్మనెను
కూర్చుండి సాగెను సీయోనుకు
సమాధానము ప్రకటించుటకు
సమాధానమును ప్రకటించుటకు
3. బాలుర పసిపిల్లల నోట
ఉంచిన స్తోత్ర ధ్వనులచేత
స్థాపించియుండెను దుర్గమును
అణిచివేయను శత్రువును
అణిచివేయుటకు శత్రువును