ఎండిన భూమిలో – Endina bhumilo
ఎండిన భూమిలో – Endina bhumilo
యెషయ 53వ అధ్యాయం నుండి శిలువ ధ్యాన కీర్తన.
ఎండిన భూమిలో మొలచిన లేతమొక్క వలె పెరిగితివా
మనుష్యులు చూచి అపేక్షించునట్లుగా సురూపమైన లేకయుంటివా
అను పల్లవి:
నాయేసయ్య నాయేసయ్య సిలువలో నాకై శ్రమనొందితివా
నాయేసయ్య నాయేసయ్య సిలువలో నన్ను రక్షించితివా
1.నాయతిక్రమమే నిన్ను గాయపరచెనా -నాదోషములే నిన్ను నలుగగొట్టెనా
నా శిక్ష ను నీవు భరియించితివా -నా రోగముకే స్వస్థతనిచ్చితివా
2.చెదరిన నాకై అరుదెంచితివా- బలియాగముకై సిద్ధపడితివా
గొర్రె పిల్ల వోలె మౌనివైతివా- నిర్ధోషినిగ నను మార్చితివా
3.నీ నీతితో నను విడిపించితివా-కృతజ్ఞతతో నిను స్తుతియింతున్
నీతిమంతుడా నిను ఘనపరతున్ -నీ సాక్షిగా నేను కొనసాగుదున్