యేసుకు అమ్మివేయబడ్డదానను – Yesuku Ammiveyabaddadhaananu

Deal Score0
Deal Score0

యేసుకు అమ్మివేయబడ్డదానను – Yesuku Ammiveyabaddadhaananu Telugu Christian song lyrics and sung by by Ps.Manasa.Christ Covenant Center, Guntur.

యేసుకు అమ్మివేయబడ్డదానను
పనికి రాని పాత్రను ఘనమైన పాత్రగ
బానిస నేను నీకు యేసయ్య
వారసునిగా నన్ను చేసితివె……..||2||
యేసయ్యా…నా యేసయ్యా…యేసయ్యా…నా యేసయ్యా…

1) కాసుకే చెల్లని నన్ను – నీ సొంత రక్తముతో కొన్నావు
రూపమేలేని నన్ను – నీ సమరూపిగ మార్చావు…..||2||
స్వాస్థ్యమే లేని నాకు – నీవే నా స్వాస్థ్యమయ్యావు
పేరుతో తెలియని నన్ను – నీ పేరుతో ప్రసిద్ధి చేశావు

నీవే నా బంధువయా యేసయ్యా – నీవే నా బంధమయా మెస్సయ్య
నీవే నా స్నేహమయా యేసయ్యా – నీవే నా సకలమయా మెస్సయ్య

2) మాట సరళిలేని నాకు – నీ మాటలే అగ్నిగా పలికించావు
ఒంటరి పోరాటంలో – పరలోక సైన్యాని సమకుర్చావు…||2||
కృపను కోల్పోయినప్పుడు – నీ కరుణే ఆదరణాయె
విసిగి ప్రశ్నించిన నాకు – నీ పరమార్థమును నేర్పావు

పనికిరాని శిలనయ్యా యేసయ్య – నన్ను మలచిన శిల్పివయ్య మెస్సయ్య
ఆత్మలేని దాననయ్యా యేసయ్యా – పరిశుద్ధాత్మతో నింపితివి మెస్సయ్య

3) ప్రాణమే లేని నాకు – పరిచర్యే ప్రాణంగ మార్చావు
నీ కొరకు పొందిన శ్రమలే – అతిశయకారణముగ చేశావు…||2||
ఓటమి నను వెంబడించిన – నీ విజయం నాకిచ్చావు
నేను నిన్ను చేరువరకు – నీ సేవయే దేవ నా ఊపిరి

నీవే నా సైన్యమయా యేసయ్య – నీవే నా స్వాస్థ్యమయా మెస్సయ్య
నీవే నా గమ్యమయా యేసయ్య – నీవే నా గమనమయా మెస్సయ్య

లోకానికి బానిసనైతిని ఒకనాడు…
క్రీస్తు ప్రేమకు బానిసనైతిని ఈనాడు…

యేసుకు అమ్మివేయబడ్డదా

యేసుకు అమ్మివేయబడ్డదానను song lyrics, Yesuku Ammiveyabaddadhaananu song lyrics. Telugu songs.

Yesuku Ammiveyabaddadhaananu Song lyrics

Jeba
      Tamil Christians songs book
      Logo