Yesayya Nee Rupamu Entha Sundaramo song lyrics – యేసయ్యా నీ రూపము ఎంత

Deal Score+1
Deal Score+1

Yesayya Nee Rupamu Entha Sundaramo song lyrics – యేసయ్యా నీ రూపము ఎంత

పల్లవి:
యేసయ్యా నీ రూపము ఎంత సుందరమో మెస్సయ్య నీ మాటలే వినుట ధన్యము “2”
కష్టకాలమందు చిక్కులలో నేను పడి ఉండగా
నీ చేతులు చాపి నన్ను పిలుచుకున్నావు
ఆదరించావు స్వస్థతనిచ్చావు ధైర్యపరిచావు కౌగిట దాచావు ” యేసయ్యా “

చరణం 1:
కారు మబ్బులే కమ్మినను కఠినమైన బంధకాలలో
కరుణమూర్తి నీవే నన్ను విడిపించగా “2”
ఎడారి పయనంలో ఏకాకిగా మారి
నీ వైపు తిరిగేదెను నీ కొరకు నిలిచెదను
ఎందరు ఉన్నను ఒంటరినైనాను ఆప్తుడిగా మారి నా చింతచేరితివి ” యేసయ్యా “

చరణం 2:
వ్యాధి బాధల శోకసంద్రంలో నే మునిగి పోయినను
దయామయుడు నీవే నన్ను లేవనెత్తగా “2”
కృంగిన వేళలో ఓదార్పునిచ్చావు
పగిలిన గుండెకు ప్రాణం పోసావు
సర్వాధికారివి సత్యస్వరూపివి సర్వము నెరిగిన నిజ దేవుడవు ” యేసయ్యా “

చరణం 3:
ఊహకందని ఆశ్చర్య కార్యాలు నా కొరకై చేసిన
ప్రేమ సాగర నిత్యము నిన్నే కొలిచెదనయ్యా “2”
తల్లి తండ్రి మరచిన నన్ను మరువకున్నావు
చెయ్యి జార నివ్వక నన్ను పట్టుకున్నావు
నీకు ఏమి ఇవ్వను తీర్చలేని రుణమును నా జీవితమంతా నీ కొరకే బ్రతికేదను ” యేసయ్యా “

    Jeba
        Tamil Christians songs book
        Logo