ఏ పాట పాడను – Ye Paata Paadanu

Deal Score0
Deal Score0

ఏ పాట పాడను – Ye Paata Paadanu

పల్లవి : ఏ పాట పాడను…? ఏ మాట చెప్పను… ? ఏ పదము చాలును…? ఏ భాష చాలును..?
ఏ విధము చాటను నా హృదయ నాథుడా
నీ… ప్రేమ చాటను నా… ప్రేమ పూర్ణుడా
ప్రియుడా యేసయ్య ప్రేమ రూపివి నీవయ్యా – 2 || ఏ పాట పాడను||

చరణం1: నిన్నెంతగానో బాధించినా – నిను వీడి దూరంగ నే పోయినా – 2
నేనెంతగానో చెడిపోయినా..నను వీడలేదే విలువైన ప్రేమా…
వివరించ నా తరమౌనా…?
దేవా నా ప్రియ దేవా నీ దరి చేరి స్తుతులను తెలుప
నీకై నన్నిల నిలిపి లోకములోని ప్రేమను తెలుప
నాపై నీవే చూపిన కృపలన్ని తలచి. || ఏ పాట పాడను||

చరణం2 : ఎత్తైన కొండకు ఎక్కించను – వింతైన ప్రేమను చూపించను – 2
నిండైన దీవెన నాకియ్యను – నా చెంత చేరిన నీ ప్రేమను
వివరించ నా తరమౌనా…?
రాజా యేసు రాజా నిన్నే కొలువ మహిమను తెలుప
నాపై నీ దయ చూపి లోకములోని ప్రేమను తెలుప
నాపై నీవే చూపిన కృపలన్ని తలచి. || ఏ పాట పాడను||

    Jeba
        Tamil Christians songs book
        Logo