VACHADAYYA YESU – నాలుగు దిక్కుల చీకటి చీల్చి

Deal Score+3
Deal Score+3

నాలుగు దిక్కుల చీకటి చీల్చి
భూమిని రంగుల బంతిగ మార్చి
చిక్కులు తీర్చగ చేతులు చాచి
చుక్కల దారిన నేలకు వచ్చి
కన్నీల చూపును కాంతిగ మలిచి
కష్టాల దారికి కాపుగ నిలిచి
మాములు మనిషిగ లోకుల కాచి

Chorus:
అదిగో వచ్చాడయ్య యేసు
మన ప్రాణాల తోడు
అదిగో వచ్చాడంట చూడు
తనలాంటోడు లేడు

మన చీకట్లనే యేరు వాకిట్లో తెల్లారు
వెలుగళ్ళే వేంచేసినాడు

చుక్కలనుండి దిక్కులదాక
తానే ఉన్నాడు
వంచన తుంచి మంచిని పెంచే
మారాజయ్యాడు
ఎండలలోనే వెన్నెల్ల పూసే
గొడుగై వస్తాడు
ఆపదలోనే అండగ వచ్చి
గుండెల నిండుగ పండగ తెచ్చి

ఈ మట్టినే మార్చావుగా
నీ నామముండే పరలోకమై
నీ నెత్తురే పంచావుగా
పాపాలు మాపే పరమాత్మవై
శిరి వెన్నెల్లు చూసాక నీ రూపునా
మా కన్నుల్లో కడతేరె ఆవేదన
ఎంత కారుణ్యమో ఉంది నీ పేరునా
తప్పు మన్నించి దయ చూపు నీ లాలన
నీ మార్గాన్ని దరిచేరి శరనందున
నీ కృపతోనే ఇకపైన జీవించిన

ఆ పువ్వులు మా నవ్వులు
నీ రాకతోనే పూసాయిల
నీ చూపులో మా రాతలే
మార్చేసి మళ్ళీ రాశావిలా
నిత్యజీవాన్ని కరుణించు నీ తోడునా
నువ్వు ఎడబాటు కాకుండ మా బ్రతుకున
ఎన్ని కష్టాలు మోసావో మా వంతునా
నే నేమిచ్చి తీర్చాలి నీ రుణమిల
దైవమే కోరి పంపింది ఈ దీవెన
అందుకున్నాము నీ ప్రేమలో పాలన

christians
We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians songs book
      Logo