Undedhevaru Poyedhevaru – ఉండేదెవరు పోయేదెవరు

Deal Score+1
Deal Score+1

Undedhevaru Poyedhevaru – ఉండేదెవరు పోయేదెవరు

ఇదే చివరి దినమైతే – ఎటు వైపో నీ ప్రయాణం…
అదే పాత బ్రతుకైతే – రక్షణ పొందిన వ్యర్థం.

పల్లవి:-
ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో…
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ll2ll
జీవము దిగివచ్చింది – ప్రభు యేసుని రూపంలో
అవకాశము మనకొచ్చింది – పరలోకము చేరుటకూ

చరణం:-1
ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా ll2ll
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు ll2ll
సిరికి దేవునికి… దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని… తాను కొదువ కలిగి జీవించాడు
ll ఇదే ll
చరణం:-2
తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా ll2ll
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు ll2ll
నీ తండ్రిని చూచుటకు… పరలోకం చేరుటకు
తప్పిపోయిన కుమారుడా… తప్పు దిద్దుకొని రావయ్యా…
ll ఇదే ll
చరణం:-3
క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా ll 2 ll
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో ll 2 ll
సంచరించుటకూ… నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము…
ll ఇదే ll

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo