సువార్తే పరిష్కారం – Suvarthe pariskaram

Deal Score0
Deal Score0

సువార్తే పరిష్కారం – Suvarthe pariskaram

అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

  1. సువార్త సారం తెలిసుండీ
    నిస్సార సాక్ష్యం మనదేనా
    పరలోక వెలుగును కలిగుండీ
    మరుగైన దీపం మనమేనా

ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

  1. జాతివిద్వేషపు జాడ్యంలో
    మతోన్మాద విషమౌఢ్యంలో
    దేశం ఆరని జ్వాలాయె
    సంఘం హింసలపాలాయె ||ఇకనైనా లేవరా||
  2. అబద్ద బోధల మోసాలు
    అణగారుతున్నవి సంఘాలు
    వేలకువేల కుటుంబాలు
    నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా లేవరా||
  3. జెండరు గందరగోళాలు
    లింగద్రవత్వపు ఘోరాలు
    సంధిగ్ధంలో నేటితరం
    సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా లేవరా||
  4. బహుళ సవాళ్ళను ఎదురుకొని
    ఐక్యత బంధం నిలుపుకుని
    రేపటి తరాన్ని శిష్యులుగా
    నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా లేవరా||
    Jeba
        Tamil Christians songs book
        Logo