Sukumaarudaa Hosanna Song lyrics – సుకుమారుడా

Deal Score0
Deal Score0

Sukumaarudaa Hosanna Song lyrics – సుకుమారుడా

జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము
పాడెద నిరతము ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమే చాలయ్య
(జగమునేలే పరిపాలక)

మహారాజుగా నా తోడువై
నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము
ఎన్నడు నను విడదే (2)
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)

సుకుమారుడా నీ చరితము
నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం
నాకిది నీ భాగ్యమా (2)
జీవితమంతా నీకఆర్పించి
నీ రుణము నే తీర్చనా (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)

పరిశుద్ధుడా సారధివై
నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన
ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి
విజయము నే చాటనా (2)
నా ప్రతిక్షణము ఈ భావనతో
గురి యొద్దకే సాగెదా (2)
(యేసయ్య యేసయ్య నీ కృపా)

    Jeba
        Tamil Christians songs book
        Logo