సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu song lyrics

Deal Score+1
Deal Score+1

సకలము చేసిన సృష్టికర్తవు – Sakalamu cesina srstikartavu song lyrics

సకలము చేసిన సృష్టికర్తవు
సకల జనుల నిర్మాణకుడవు (2)
నిను స్తుతియిoతును యేసు ప్రభు
నిను కీర్తింతును యేసు ప్రభు (2)
ఆ||ప|| నీవే ప్రభో నీవే ప్రభో-నీవే ప్రభో యేసు ప్రభో (2)

1. అల్ఫయు నీవే ఓమెగయు నీవే
ఆది అంతముల దేవుడ నీవే (2)
నను ప్రేమించిన వాడవు నీవే
నను రక్షించిన నాధుడ నీవే (2) ||నీవే ప్రభో ||

2. సకల యుగములకు రాజువు నీవే
అద్వితీయ దేవుడ నీవే (2)
దీనుల పాలిటి పెన్నిధి నీవే
నా జీవితముకు ఆధారం నీవే (2) ||నీవే ప్రభో ||

3. సైన్యముల కధిపతియు నీవే
సర్వశక్తి గల దేవుడవు నీవే (2)
తిరిగి రానున్న రాజువు నీవే
పరమున చేర్చే ప్రభుడవు నీవే (2) ||నీవే ప్రభో ||.

    Jeba
        Tamil Christians songs book
        Logo