పల్లవి: రాజు వెలిసే బెత్లేహేములో ఆరంబమాయే సందడిలలో
పాక వెలిగే కాంతులతో క్రీస్తు యేసుని జననముతో
రక్షకుడు పుట్టే రక్షణను తెచ్చే ఆనందం ఆనందం లోకమంతా సంతోషం ||2||
• కాపరులే మంద కాయుచుండగా దూత వచ్చి శుభ వార్త చెప్పెగా
జ్ఞానులు బాలుని చూడవచ్చి పూజించి క్రీస్తుకి మ్రొక్కిరి
తార తెలిపే మార్గమంతా
కానుకలను క్రీస్తుకు అర్పించిరి
జనులారా చాటి చెప్పడీ. ||రక్షకుడు||
రక్షకుడు పుట్టే రక్షణను తెచ్చే ఆనందం ఆనందం లోకమంతా సంతోషం ||2||
•కన్యకు పుట్టిన పుత్రినితో కాలము పరిపుర్ణమాయేనుగా
పాపము విడచి పరుగెడి రా పరముకు నిన్ను చేర్చునుగా
పాకలో పుట్టుట విచిత్రమే ఈ భువిలో ఇది సంభరమే
జనులారా చాటి చెప్పుడి ||రక్షకుడు||
రక్షకుడు పుట్టే రక్షణను తెచ్చే ఆనందం ఆనందం లోకమంతా సంతోషం ||2||
దావీదు పట్టణమందు రక్షకుడే నీ కొరకు నేడే పుట్టెను
యేసయ్య స్వర్గానికి మార్గమండి తెలుసుకోండి జనులారా