Pilichinavaadavu song lyrics – పిలిచినవాడవు నమ్మదగినవాడవు
Pilichinavaadavu song lyrics – పిలిచినవాడవు నమ్మదగినవాడవు
పిలిచినవాడవు నమ్మదగినవాడవు
శ్రమలోనున్న వేదలోనున్న
కలవరమైన అవమానములైనా
నీ కృపలో ననుదాచావు నీకె వందనం
యేసయ్యా నీ పిలుపులోని మకరందము
యేసయ్యా నీ కృపలో ఆనందభరితము
త్రోవప్రక్క పడిమొలచిన మొక్కను నేను
సత్తువు గల భూమిలో నను నాటితివే
నీరుకట్టిన తోటలో కంచవేసి పెంచావు
ఫలములతో నింపి పరవసింపజేసావు
మహిమగల పరిచర్యను మంటికిచ్చావు
దేవదూతలకులేని కృపనిచ్చావు
జీవజలపు ఊటలతో నను ఊరేగించావు
యాజక సైన్యములో నను చేర్చావు
ఆకలి దప్పులులేని ఆ దివ్యనగరిలో
నిందలు బాధలులేని సీయోను వాసులతో
నీతి సమాధానముతో ఆత్మలో ఆనందముతో
షాలేము రాజుతో రాజ్యమేలేదన్.