ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
ఒంటరినని ఏడ్చుచుంటివా – Ontarinani edcucuntiva
ఒంటరినని ఏడ్చుచుంటివా – ఓదార్చేవారు లేక కృంగియుంటివా (2)
నిను పిలిచినవాడు నమ్మదగినవాడు – ఏ స్థితిలోనైనా నీ చేయి విడువడు (2)
ఇమ్మానుయేలులా నీకు తోడుండువాడు (2)
1. తలిదండ్రులే యాకోబును పంపివేయుచున్నా కష్టములో తోడెవరూ తనతో రాకున్నా (2) ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని బేతేలులో అన్నాడుగా (2)
స్వాస్థ్యమునిచ్చి తన సొత్తుగ చేసి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును
2. శారాయే హాగరును – గెంటివేయుచున్నా తన తనయునికి ధనము ఏమివ్వకున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని హాగరుతో అన్నాడుగా (2)
నీటి ఊటను చూపి దాహము తీర్చి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును
3. తండ్రి ఇంట యోఫ్తాకు – స్వాస్థ్యము లేదన్నా పగబట్టి జనులంతా – తోలివేసియున్నా (2)
ఆపదలో ఆధారమైనాడుగా భయపడకని మిస్సాలో అన్నాడుగా (2)
విజయము నిచ్చి అధికారిగా చేసి (2)
ఓదార్చిన దేవుడు – నిన్ను ఓదార్చును ॥ఒంటరి॥