Okkadine Unnanaya song lyrics – ఒక్కడినే ఉన్నానయ్యా ఆ ఆ

Deal Score0
Deal Score0

Okkadine Unnanaya song lyrics – ఒక్కడినే ఉన్నానయ్యా ఆ ఆ

పల్లవి: ఒక్కడినే ఉన్నానయ్యా ఆ ఆ
ఓదార్చే వారే లేరయ్యా”2″

  1. ప్రేమించేవారు దూషించుచుండగా
    ఎవరికి ఎవరో ఇక ఎవరెవరో “2”
    నీవు నాకు ఉండగా నీవే నా అండగా “2” (ఒక్కడినే)
  2. అభిమానించేవారు అవమానించుచుంటే
    ఆశ్రయం లేక ఆదరణ లేక “2”
    నీ పాదాలపై నా కన్నీళ్లు విడుచుచు “2” (ఒక్కడినే)
  3. ఎదలోని బాధ ఎవరికి తెలుసు
    యేసయ్య నీవే చూచుచున్నావు “2”
    నీ ఎదపైన నేను ఒదగాలనీ “2” (ఒక్కడినే)
  4. ఏ బంధము లేదు ఏ బలము లేదు
    ఎటువైపు నుండి ఏ ఆశ లేదు “2”
    చేతులే మిగిలాయయ్యా నీ వైపు చాపుటకు “2”
    (ఒక్కడినే)
    Jeba
        Tamil Christians songs book
        Logo