Nesthama Needu Hrudayam – నేస్తమా నీదు హృదయం
Nesthama Needu Hrudayam – నేస్తమా నీదు హృదయం
అను పల్లవి:
మాయ లోక – మార్గములలో – మరణమే చూస్తావా…
మార్పు చెంది – మర్మమెరిగి – మహిమనే చూస్తావా…
పల్లవి:
నేస్తమా… నేస్తమా… నీదు హృదయం శోకమా…
నేస్తమా…నేస్తమా… తోడు యేసని మరవకుమా…
నేస్తమా… నేస్తమా…నీదు బ్రతుకే శూన్యమా…
నేస్తమా… నేస్తమా.. పరి..పూర్ణ యేసుని వీడవకుమా…
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా…
సృష్టికర్తనే మరచి సృష్టి కే బానిసవైనావా… (2)
బానిసవై బలహీనుడవై… ఆఆ…. ఆ….
పాపములో పడిపోయిన నిన్ను ఆఆ…. ఆ….
బానిసవై బలహీనుడవై… పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి… కృపను చూపి… పరమ ప్రభువు నీకై పరితపించే… నేస్తమా….
నేస్తమా… నేస్తమా… నీదు హృదయం శోకమా…
నేస్తమా…నేస్తమా… తోడు యేసని మరవకుమా…
చరణం – 1
నువ్వు ప్రేమించే ధనము – స్నేహితులు బంధువులు
కడ కష్టం మిగిలాక – నీవెవరో వారెవరో (2)
(ఏ) కరువులోనైన కలతలోనైన కన్నీళ్లే మిగిలెనా
ఆ కరుణామయుని కరములే నీకు శరణముల్ శరణముల్ (2) నేస్తమా….నేస్తమా… నేస్తమా… నీదు బ్రతుకే శూన్యమా…
నేస్తమా… నేస్తమా.. పరి..పూర్ణ యేసుని వీడవకుమా…
చరణం – 2
నిను ప్రేమించెను యేసు – రక్షణ ఇచ్చెను నీకు
తన చేతిని అందించి – నడిపించేను కడవరకు (2)
(స్థిర) శాశ్వత నిత్య జీవ రాజ్యమును నీకు అందింపగా
నిన్ను నన్ను క్షమియింప సిలువలో ప్రాణమర్పించేగా (2)
నేస్తమా….
ఆ…. ఆ…. ఆ….
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా…
సృష్టికర్తనే మరచి సృష్టి కే బానిస అయినవా…
బానిసవై బలహీనుడవై… ఆఆ…. ఆ….
పాపములో పడిపోయిన నిన్ను ఆఆ…. ఆ….
బానిసవై బలహీనుడవై… పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి… కృపను చూపి… పరమ ప్రభువు నీకై పరితపించే… నేస్తమా….
మాయ లోక – మార్గములలో – మరణమే చూస్తావా…
మార్పు చెంది – మర్మమెరిగి – మహిమనే చూస్తావా…
మార్పు చెంది – మర్మమెరిగి – మహిమనే చూస్తావా…
మహిమనే చూస్తావా… మహిమనే చూస్తావా…
మహిమనే చూస్తావా… మహిమనే చూస్తావా