Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ

Deal Score0
Deal Score0

Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ

పల్లవి :
సర్వజనులకు దేవుడవైన నా యేసయ్య
నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా
సర్వశక్తుడా సర్వోనతుడా
నీకు అసాధ్యమైనది ఏదియు లేదు
నీకు సమస్తము సాధ్యమే యేసయ్య

చరణం:
నా దీనస్థితిని చూచి విరోధులు ఉల్లసించగా
నా కన్నీరే నాకు అన్నపానములవ్వగా
నా హృదయమే ముక్కచెక్కలవ్వగా
నే కృంగిన వేళలో నిరీక్షణ ఇచ్చితివి
నా హృదయంతో ప్రహర్షించుచున్నది

చరణం:
వైద్యుల వైద్యములు ఫలితములివ్వక
నా ప్రాణము నాలో నీరసించగా
సంఘ ప్రార్థనలే విడుదల నివ్వగా
నా మనవి మ్రొక్కులన్నీ అంగీకరించి
గర్భఫలముతో నన్ను దీవించితివి

Neeve Naa Neerikshana Telugu Christian song lyrics
Lyrics : Pastor P Stephen Raju
Tune : Sister Beulah Stephen
Vocals : Sister Shekinah Glory

Jeba
      Tamil Christians songs book
      Logo