Neetho Gadipe – నీతో గడిపే
Neetho Gadipe – నీతో గడిపే
నా హృదయం
పల్లవి:
నా హృదయం ఉప్పొంగేనే నీ సన్నిధికి నే చేరగా
మది దాహం తీరిపోయేనే నీ వాక్యం నాలో చేరగా
నీతో గడిపే ప్రతిక్షణం నూతన అనుభూతి కలిగినే
నాలో ఉప్పొంగే ఉత్సాహమే వెనుకట్టి నన్ను నడుపుతున్నది
అను పల్లవి: యేసయ్య నీ అనురాగమే నా ఆత్మకు ఆనందము కలిగినే
నా యేసయ్య నీ ఆలోచన దీవించాలని నను ఎల్లప్పుడూ
చరణం: 1
ఈ లోక అందమే గొప్పదని ఆనందమే నాకు దొరుకునని
ఆశతో అందుకోవాలని వాటి వెంట పరుగులు తీసితిని
వ్యర్థంగా పరుగులు తీశానని మోసపోయాకనే అనుకున్నానయ్య
నిజమైన సంతోషం ఉన్నదని నీ స్నేహం లోనే తెలుసుకున్నానయ్యా
అనుపల్లవి: యేసయ్య నీ అనురాగమే….
….
చరణం: 2
పాప చీకటే వెలుగని భ్రమలోనే నేను బ్రతికితిని
పాపముతో జతకట్టాలని నీ చెలిమి నేను విడచితిని
నీ వాక్య కాంతిలో నన్ను చూడగా నా లోపాలనె కనుగున్నానయ్యా
మన్నించే తండ్రివి నీవేనని నీ కౌగిటినే కోరుకున్న నయా
పల్లవి : నా హృదయం