Naalo Neevu Neelo nenu song lyrics – నాలో నీవు నీలో నేను

Deal Score0
Deal Score0

Naalo Neevu Neelo nenu song lyrics – నాలో నీవు నీలో నేను

పల్లవి : నాలో నీవు – నీలో నేను ఉండాలనీ
నీ యందే పరవశించాలని
నా హృదయ ఆశయ్యా
ప్రియుడా యేసయ్యా

  1. కడలి యెంత ఎగసిపడినా
    హద్దు దాటదు నీ ఆజ్ఞలేక
    కలతలన్ని సమసిపోయే
    కన్న తండ్రి నిను చేరినాక
    కమనీయమైనది నీ దివ్య రూపము
    కలనైనా మరువను నీ నామ ధ్యానము
    llనాలో నీవు||
  2. కమ్మనైనా బ్రతుకు పాట
    పాడుకొందును నీలో యేసయ్యా
    కంటి పాప యింటి దీపం
    నిండు వెలుగు నీవేకదయ్యా
    కరుణా తరంగము తాకేను హృదయము
    కనురెప్ప పాటులో మారేను జీవితం
    ||నాలో నీవు||
  3. స్నేహమైనా సందడైనా
    ప్రాణమైనా నీవే యేసయ్యా
    సన్నిదైనా సౌఖ్యమైనా
    నాకు ఉన్నది నీవేకదయ్యా
    నీలోనే నా బలం నీలోనే నా ఫలం
    నీలోనే నా వరం నీవేగ నా జయం
    ||నాలో నీవు||
    Jeba
        Tamil Christians songs book
        Logo