NAA PRAANAMA LYRICS :
నా ప్రాణమా, నా సర్వమా, నా దైవమా…. యేసయ్యా..
నా జీవమా, నా కేడెమా, నా బలమా…
1.నీవు లేక నేను జీవించలేను
నీవు లేని క్షణము నే బ్రతుకలేను
నీ ఊపిరి నాలో ఉంచావయ్యా – జీవాత్మగా నన్ను చేసావయ్యా
నీ ఆత్మ , నా ఉపిరి, నా జీవం యేసయ్యా
నీ ఊపిరి ,నా ఉనికి, నా ప్రాణము
2 . నా పాపములే నను తరిమిన వేళ – నీ రక్తంతో శుద్ధీకరించావు
నా శత్రువులే వెంటాడిన వేళ నీ హస్తముతో నన్నాదుకున్నావు
నీ రక్తమే నాకు జయం – నాకభయం యేసయ్యా…
నీ హస్తమే నాకు బలం – నా కేడెము
3. నిను చూడకుండా నే బ్రతుకలేను- మాట్లాడకుండా జీవించలేను
నీ వైపు చూస్తూ నే వెంబడించెదా – నీ సన్నిధిలోనే నే జీవించెదా …
నీ మాటలే నా గమ్యం- నా గానం యేసయ్యా…
నీ సన్నిధి నా సర్వము నా సమస్తము……