ఈనాటికి నేనెరుగను నాపై – Naa Pai Nee Empika
ఈనాటికి నేనెరుగను నాపై – Naa Pai Nee Empika
ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో..
ఏనాటికి నే మరువను నాపై ఈ ప్రేమ ఏలనో..
ఏముందని చూడక – పాపినని విడువక
కొలతలేని కృపను కురిపించినావు మానక..
ఏముందని చూడక – పాపినని విడువక
ఎనలేని ప్రేమను కురిపించినావు మానక..
తండ్రీ – నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు – నీ దివ్య ప్రేమ – నీ దివ్య ప్రేమా.
లోకాశలకు లొంగి – ఓడిపోయిననూ
కన్నవారే కఠినులై – కాదనిననూ (2)
పిలిచావు నన్నే – కావాలనంటూ..
దాచావు నీ కౌగిలిలో భద్రముగా.. (2)
తండ్రీ – నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు – నీ దివ్య ప్రేమ – నీ దివ్య ప్రేమా.
పరిశుద్ధముగా నీకై జీవించాలనీ
పరలోకములో నీతో పరవశించాలనీ (2)
దీవించుమయ్యా – బలపరచుమయ్యా
నడిపించు నీ ఆత్మతో నీ సాక్షిగా.. (2)
తండ్రీ – నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు – నీ దివ్య ప్రేమ – నీ దివ్య ప్రేమా