
NA STUTHI PATRUDA NEEKEY ARADHANA New Telugu Christian Song 2020
Song Lyrics
నీకే ఈ ఆరాధన (4)
పల్లవి :
నా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన
నా ప్రేమామయుడా నీకే ఆరాధన
నా స్తుతి పాత్రుడా నీకే ఆరాధన
నా ప్రేమామయుడా నీకే ఆరాధన
నను నడిపిస్తున్న తేజోమయా
నన్నాదుకున్నా పరిశుద్ధుడా
నను నడిపిస్తున్న తేజోమయా
నన్నాదుకున్నా పరిశుద్ధుడా……
చరణం 1
నీ… ప్రేమను గ్రహియింపక
నీ… త్యాగమూ తలపోయక
నీ… ప్రేమను గ్రహియింపక
నీ… త్యాగమూ తలపోయక
నిన్ను వీడి నందు నేను
పాప ఊబిలో పడియుంటిని
నిన్ను వీడి నందు నేను
పాప ఊబిలో పడియుంటిని
దయతో నన్ను లేపితివి
నీ….. దయతో నన్ను లేపితివి
” నా స్తుతి పాత్రుడా”
చరణం 2
ప్రయాసయు నా భారమును
నీ మీదే నేను మోపితిని
ప్రయాసయు నా భారమును
నీ మీదే నేను మోపితిని
నీదు త్యాగము వివరింపలేను
కృపను చూపి కరుణించితివి
నీదు త్యాగము వివరింపలేను
కృపను చూపి కరుణించితివి
కృపలో నన్ను దాచితివి
నీ…. కృపలో నన్ను దాచితివి
” నా స్తుతి పాత్రుడా”