Na Antharangamuna song lyrics – నా అంతరంగమున
Na Antharangamuna song lyrics – నా అంతరంగమున
నా అంతరంగమున నీవే యేసయ్య
ఈ దీనుడి మనస్సు నీకేనయా
స్తుతియించెద ఇలలో నిన్ను నిత్యం
ఈ కన్నీటి ఆరాధన నీకే అంకితం
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్య
నాదు హృదయము అంత అగాధము
అర్ధం తెలియని ఈ జీవితం
అన్నియు వున్నా ఎదో వెలితి
దారే ఎరుగని ఈ పయనం
దరి చేరి నన్ను అక్కున చేర్చి
నీ ప్రేమను పంచి నీ దారి చూపి
హృదయమంతా నిండావు
జీవిత అర్ధం తెలిపావు
నా జీవిత అర్ధం తెలిపావు
ఎన్నో శ్రమలు ఎంతో వేదన
భారమైన నా హృదయం
మార్గములెన్నో గమ్యం ఒక్కటే
నశించే తనువు అణువణువు
నీ సత్య వాక్యముచే బలపరచి
నీవే మార్గము అని వివరించి
నిత్య జీవమిచ్చావు హృదయములో నెలకొన్నావు
నా హృదయములో నెలకొన్నావు