మంచి స్నేహితుడు – Manchi snehithudu

Deal Score+1
Deal Score+1

మంచి స్నేహితుడు – Manchi snehithudu

పల్లవి:
మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు ప్రాణస్నేహితుడేసు

చరణం 1:
ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగా నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు

చరణం 2:
చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు

    Jeba
        Tamil Christians songs book
        Logo