Madhi Pulakinche Telugu marriage song lyrics – మది పులకించే ఈ రోజు నీ రాకతో
Madhi Pulakinche Telugu marriage song lyrics – మది పులకించే ఈ రోజు నీ రాకతో
మది పులకించే ఈ రోజు నీ రాకతో
మనసులు కలిసే ఏనాడో తొలిచూపులో (2)
మధురమే ఈ కళ్యాణ ఘడియ
మనసులు కలిసిన ఈ మధుర ఘడియ (2)
కళ్యాణము కమనీయము నవీన్ షకీనా ల ఈ బంధము
వివాహము వైభోగము పరిశుద్ధ దేవుని సంకల్పము (2)
మీ జంటగా ఈ బంధము – ఉందిలే ఏదో క్రొత్తగా
ఏదేనులో ఏనాడో – మన దేవుడే స్థిరపరచెగా
సతీపతులు – సగం సగముగా
నవీన్ షఖీనాలు – సంపూర్తిగా
సాగాలి క్రీస్తులో – అన్యోన్యంగా
నిలవాలి మీరు – ఆదర్శంగా
ఓ వరుడా నీ ముందు నిలిచే – నీ ఎముకే నీ వధువుగా
మీ ఇరువురి ఆశల స్వప్నం – మారింది కళ్యాణ వేడుకగా
ఒకరికొకరు – తోడుగా
క్రీస్తు కొరకు – మీరొకరిగా
కలిసి నడవాలి – ఆనందంగా
ప్రభు యేసు ప్రేమకు – ప్రతిరూపంగా