మార్గరూపివై నా ప్రేమరూపివై – Maaragarupivai na prema
మార్గరూపివై నా ప్రేమరూపివై – Maaragarupivai na prema
పల్లవి : మార్గరూపివై – నా ప్రేమరూపివై
నా మంచి కాపరి – ప్రధాన కాపరి
సజీవుడవు నీవే సదా తోడు నీవే
సర్వాధికారి నీవే సదా మహిమ నీకే
మదిలో నిండిన మధుర గానమై
హృదిలో నిలచిన నా హృదయ సారథి
1) నీ చూపుతో నన్ను మార్చినావులే
నీ చేతితో నన్ను ముట్టినావులే
నీ మాటతో రక్షించినావులే
నీ మార్గములో నడిపించినావులే
నా కొరకు నీవు మరణించినావే
నన్నింత కాలము కాచినావు నీవే
ఏమని వర్ణింతు నీ ప్రేమను
ఏమని వివరింతు నీ త్యాగము
2) నా మంచి దేవా నమ్మదగినవాడవు
నా పాపబ్రతుకును క్షమియించితివే
నీ త్రోవలో నన్ను నడుపుట కొరకు
నీ పాత్రగా నన్ను నిలుపుకుంటివే
నా భారమంతా నీవు భరియించి
నీ రెక్కల నీడలో నను దాచావు
ఏమని వర్ణింతు నీ ప్రేమను
ఏమని వివరింతు నీ త్యాగము.