Krupane Korukondunu song lyrics – కృపనే కోరుకొందును
Krupane Korukondunu song lyrics – కృపనే కోరుకొందును
కృపనే కోరుకొందును నీ కృపలోనే దాగివుందును కృపామయుడా నీ కృపలేనిదే నేనుండలేను ||2|| || నీ కృపలో ప్రతినిత్యం నీతోనే సాగాలని అనుక్షణము ఆనందం నీలోనే పొందాలని ||కృపనే||
- నిన్ను చేరాలని – నీతో గడపాలని నీలా మారాలని నా మది కోరగా నీలో నిలవాలనీ – నీతో నడవాలనీ నాలో నీవు – నీలో నేను ఉండాలనీ – కలిసుండాలని ||2|| నీ కృపలో ప్రతినిత్యం నీతోనే సాగాలని అనుక్షణము ఆనందం నీలోనే పొందాలని ||కృపనే॥
- నిన్ను చూసే కనులు- నిన్ను కలిగిన బ్రతుకు నేను బ్రతకాలని నీ కృప లోగిలిని హత్తుకోవాలనీ నా హృది కోరగా నిన్ను చూసి నన్ను మరచిపోవాలని – నిలిచిపోవాలని ||2|| నీ కృపలో ప్రతినిత్యం నీతోనే సాగాలని అనుక్షణము ఆనందం నీలోనే పొందాలని ||కృపనే॥
- నీలో పరిపూర్ణత – నీలో పరిశుద్ధత నేను పొందాలని నా యెద లోతుల్లో ఏరులై పారని నా ప్రియనేస్తమా ||2||
హర్షించెదను – ఆస్వాదించెదను అనుదినము నే అనుదినము నీ కృపలో ప్రతినిత్యం నీతోనే సాగాలని – అనుక్షణము ఆనందం నీలోనే పొందాలని ||కృపనే॥