కొండలలో లోయలలో – Kondalalo Loyalalo

Deal Score+1
Deal Score+1

కొండలలో లోయలలో – Kondalalo Loyalalo

పల్లవి : కొండలలో లోయలలో నా తోడువు నీవేనయ్యా
వేదనలో నా బాధలలో ఆశ్రయం నీవేనయ్యా 11211

నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆధారము
నీవేనయ్యా నా యేసయ్యా నాకున్న ఆశ్రయము

  1. నె వెళ్ళే మార్గములో అడ్డంకులున్న – నాకున్న అవకాశం చేజారినా
    నా ముందు ద్వారాలు మూయబడిన – సహాయం నీవేనయ్యా ||2||
    నా ఇరుకులో విశాలత నా త్రోవకు వెలుగువాయ ||2|| ॥నీవేనయ్యా॥

2 నాకున్న ఆరోగ్యం క్షీణించుచున్న – నా దినములే నీడలా మారిన
కన్నీరె నాకు ఆహారమైన – నా ఔషదం నీవయ్యా ||2||
బ్రతికించే వాడవయ్యా బలమిచ్చే వాడవయ్యా ||2|| ॥నీవేనయ్యా॥

3దుష్టుని బాణాలు నను తాకుచున్న – మానని గాయాలు వెంటాడినా.
పరిస్థితులన్ని ప్రతికూలమైన – నా ధైర్యము నీవయ్యా ||2||
గెలిపించే వాడవయ్యా – తలఎత్తే వాడవయ్యా ||2|| ॥నీవేనయ్యా॥

    Jeba
        Tamil Christians songs book
        Logo