Kaapaadinaave telugu christian song lyrics – కాపాడినావే కనుపాపలా
Kaapaadinaave telugu christian song lyrics – కాపాడినావే కనుపాపలా
కాపాడినావే కనుపాపలా
కృప చూపినావే నా యేసయ్య
కల కాదు నిజమే
నీ కరుణాకటాక్షము
కమనీయమైన నీ ప్రేమానుబంధము
చాలయ్య నీ కృపా! నీ క్షమా! నా రక్షకా!
చాలయ్య ఈ దీవెన ! నీ దయే ! నా దైవమా !
ఉహించలేదే నీ ప్రేమనాపై
ఉన్నావు నాతో నా తోడు నీవై
ఉజ్జివనాదం మ్రోగించగానే
ఉల్లాసవస్త్రం ధరియింప జేసావే
ఎడబాయలేదే యేనాడు నన్ను
విడనాడలేదే క్షణమైన నన్ను
నేనున్న స్థితినే గమనించినావే
నాగతిని మార్చి ఘనపరచినావే
నా చెలిమి కోరి నా చెంత చేరి
నా చింతలన్ని తొలగించినావే
నాకున్నవన్ని నీవే ఇచ్చినావే
నీ కృపతో నన్ను హెచ్చించినావే