హల్లెలూయ పాడేదా – Halleluya padedaa Telugu Christian song
హల్లెలూయ పాడేదా – Halleluya padedaa Telugu Christian song
హల్లెలుయా పాడెదా… ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా
నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ll హల్లెలుయా
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్llహల్లెలూయl
ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ (2)
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ llహల్లెలుయా
కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||