గుండె ఆగకముందే – Gunde Agakamundhe
Deal Score0
Shop Now: Bible, songs & etc
గుండె ఆగకముందే – Gunde Agakamundhe
పల్లవి :1చరణం :
గుండె ఆగకముందే కళ్ళు తెరుచుకో
పాడె ఎత్తక ముందే ప్రభుని చేరుకో ॥2॥
యేసు వార్తను తెలుసుకో – నిత్యజీవం పొందుకో ॥2॥గుండె॥
- దేహమంతా మట్టేగా చూసిచూసిమురువకు
శిథిలమయ్యే శల్యమందు అన్ని ఆశలు ఎందుకో ॥2॥
కుండలాగా చితికిపోవునుగా బుడగలాగా పగిలిపోవునుగా
ఆయుష్షు మళ్ళీ వెనుకకు రాదుగా కళ్ళముందే కరిగిపోవునుగా ॥2॥
నీ దేహము దేవునికిస్తే నీ ఆత్మ క్షేమముగా
శరీరము మట్టిలో కలిసినా మహిమలో నీవుందువుగా ||2||గుండె॥
2చరణం : - అద్దెఇల్లు లాంటిది నీవు వున్న ఈలోకం –
కూడబెట్టినదేదైనా విడిచిపెట్టి వెళ్ళాలి ॥2॥
యేసు దేవుని రక్షణ నీకుంటే పరమజీవం నీకు దొరుకునుగా –
ఒక్కసారి ఆలోచించవా నరకము పరలోకముందని ॥2॥
యేసు ఒక్కడే చేర్చును ఆయనలోనే మోక్షము –
సమయమింక లేదుగా ఇప్పుడే హృదయము ఇవ్వవా ॥2||గుండె||