Cheppakunda Undagalana song lyrics – చెప్పకుండా ఉండగలనా యేసయ్య
Cheppakunda Undagalana song lyrics – చెప్పకుండా ఉండగలనా యేసయ్య
చెప్పకుండా ఉండగలనా యేసయ్య నీ మేలులు
ప్రకటించకుండా ఉండగలనా యేసయ్య నీ మాటలు-2
అనుక్షణము కాపాడుచు చూపుచున్న నీ కృపను-2
పాడకుండా ఉండగలనా నే పాడకుండా ఉండగలనా-2
1.లేనివి ఉన్నట్టుగా
చేసేటి శక్తిమంతుడా
సృష్టినంతా కలుగజేసినా సృష్టికర్త నా యేసయ్యా-2
నన్ను కలుగజేసి విధము చూడగా
నీ కార్యము ఆశ్చర్యము-2
ఆరాధించక నేనుందున నిన్నారిధించక నేనుందున-2
2.శోధన కాలమున నా ప్రక్క నిలచితివే
చిరునవ్వుతో నింపిన నమ్మదగిన యేసయ్యా-2
విశ్వసించుచున్నవారిని కలవరపడనీయవు-2
నిన్ను విడిచి ఉండగలనా నే
నిన్ను విడిచి ఉండగలనా-2
3.పాపిని క్షమియించే
కరుణా హృదయుడవు
ప్రేమించి ప్రాణమిచ్చిన నిజమైన స్నేహితుడా-2
స్త్రీలు చూపు ప్రేమకంటెను
నీ ప్రేమ మిన్నయైనది-2
నీ ప్రేమను నే మరతునా
నీ త్యాగము నే మరతునా