Challagalila Aa Pashulapakalo Song Lyrics:-
పల్లవి :చల్లగాలిలో ఆ పశుల పాకలో
చందమామల ఆ చిరునవ్వుతో “2”
విన్నావా యేసు స్వరము
కన్నావా మధుర స్వరము “2”
…..”చల్ల”……
చరణం: కన్య మరియు గర్బమందునా
పుట్టినేసు పసి బాలుడై…. ఆ….ఆ “2”
దూత దెల్పె గోల్లలకు శుభవార్త “2”
వచ్చు కొనియాడిరి గొల్లలంత… “2”
…..”చల్ల”….
చరణం: తూర్పు దిక్కు చుక్కను చూసి
జ్ఞానులు వచ్చి కొనియాడి… ఆ…ఆ…”2″
బంగారు,సాంబ్రాణి బోలములు అర్పించినారు..”2″
పాదాల యొద్ద పడి మ్రొక్కినారు.. “2”.
చరణం:
పరలోకమును వీడినావు
నరమాతృ డై నన్ను కరుణించి నావు “2”
ఈ పాపి హృదయంలో నివసించినావు.. ” 2″
నీ ప్రేమతో నన్ను బ్రతికించినావు.. “2”
….. “చల్ల”…..
చరణం:
మితిలేని నీ ప్రేమను
వివరించలేను యేసయ్య
గతి లేని నా బ్రతుకును కడతేర్చినావు యేసయ్య”
పూజింతును నే గొల్లనై “2”
సేవింతును నే జ్ఞానినై
నిన్ను సేవింతును నే జ్ఞానినై…. “
….. “చల్ల”…
We will be happy to hear your thoughts