ఆవిరైపోతున్నది నా జీవితం – Aviraipotunnadi

Deal Score0
Deal Score0

ఆవిరైపోతున్నది నా జీవితం – Aviraipotunnadi

ల్లవి : ఆవిరైపోతున్నది నా జీవితం
అంతము కానివ్వకు ఏ క్షణమైన “2”
చేరుతాను చివరకు నీ ఒడిలోకే “2”
ఉంటాను ప్రతిక్షణము నీతోనే
నేను ఉంటాను అనుక్షణము నీలోనే ” ఆవిరై “

Ch:1 దిక్కులేని పక్షిలా తిరుగుతున్నాను
ఎదురుగాలి దెబ్బకు నే పడిపోయాను “2”
నీ చేతులతో నన్ను లేపుమూ “2”
నీ బిడ్డగా అంగీకరించుము
దేవా నీ బిడ్డగా అంగీకరించుము “2” “ఆవిరై”

Ch :2: పాపమనే ఊబిలో పడిపోయాను
అంధకారములో నే మునిగిపోయాను “2”
పరిశుద్ధదేవుడవు నీవేనయ్య “2”
పాపినైన నన్ను రక్షింపుము
దేవా పాపినైన నన్ను రక్షింపుము “ఆవిరై “

Ch:3: మరణానికి పాత్రుడనై నేను ఉండగా
నీ రక్తమునిచ్చి విమోచించితివి “2”
ఏమివ్వగలన్నయ్య నీ ప్రేమకు “2”
అర్పింతును నా శేష జీవితం
దేవా అర్పింతును నా శేష జీవితం “ఆవిరై”

    Jeba
        Tamil Christians songs book
        Logo