Ashrayadurgamu Neeve song lyrics – ఆశ్రయదుర్గము నీవే నా రక్షణశృంగము నీవే
Ashrayadurgamu Neeve song lyrics – ఆశ్రయదుర్గము నీవే నా రక్షణశృంగము నీవే
ఆశ్రయదుర్గము నీవే నా రక్షణశృంగము నీవే ఆశ్రయదుర్గము నీవే నా రక్షణశృంగము నీవే అపజయాల మార్గములో జయధ్వజమైతివే అంధకారవేళలో తేజోకిరణమై -2 నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా నా క్షేమానికీ ఆధారము నీవయ్యా-2
నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే ఒక్క క్షణమైన విడిపోని అనుభంధమా ఒక్క క్షణమైన వీడిపోని ప్రియనేస్తమా ..!
మరచిపోని దైవమా . నన్ను మరచిపోలేదే తరగిపోని నీకృప చూపుచూనే ఉన్నావే -2 మారదే నీ కృప యెళ్లవేళల చాలునే నీ కృప జీవితాంతము నా స్వరమంతటి తో .నిన్ను హెచ్చించినా నిన్ను కీర్తించిన నీ ఋణము తీరున-2
దారి చూపు దైవమా నన్ను నడుపుచున్నావే దాటలేని తీరాలు దాటింప తలచావే …..2 అలసిన వేళలో ఆశ్రయమై నూతన బలముతో నింపితివి నా అపజయములను నీ మహిమకై మార్చావుగా విజయముగా నా ప్రతి అడుగులను నిను చేరగ మలచావుగా మధురముగా
పిలిచినావే దైవమా నీకై నేను జీవించ పదిలపరచుచున్నావే యెడతెగని వాత్సల్యముతో మారని ఉన్నత సంకల్పమే నెరవేర్చ చాలిన కృప నిమ్మయా ప్రాణాత్మ దేహమును సజీవయాగముగా .నీకు అర్పించనా నా యేసయ్యా నీ మహిమ రాకడలో నిన్ను సంధించుటే దర్శనమాయెనే నా ప్రాణప్రియుడా