Arhathe leni Naakai song lyrics – అర్హతే లేని నాకై

Deal Score0
Deal Score0

Arhathe leni Naakai song lyrics – అర్హతే లేని నాకై

అర్హతే లేని నాకై నరునిగా వచ్చావు పాపినై యుండగానే నీ ప్రాణమిచ్చావు (2)
ఏమిచ్చి నీ రుణం తీర్చగలనేసయ్యా (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతునయ్యా || అర్హతే||

నలిగిన నా హృదయమును బలపరచినావు
చెదరిన నా గుండెను ధృఢపరచినావు (2)
ఉల్లాస వస్త్రములు ధరియింపజేశావు (2)
ఆనంద తైలముతో అభిషేకించావు || అర్హతే||

సడలిన విశ్వాసమును స్థిరపరచినావు
కృంగిన నా ఆత్మను లేవనెత్తినావు (2)
ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో చేశావు (2)
రక్షణ మార్గములో నన్ను నడిపించావు || అర్హతే||

Arhathe leni Naakai Telugu Christian Gospel Song lyrics

    Jeba
        Tamil Christians songs book
        Logo