
ANANDA DWANI CHESEDHAM song lyrics
ఆనందధ్వని చేసెదం ఆర్భాటముతో సాగెదం
సైన్యములకు అధిపతియైన యోహావ మన పక్షము
మన బలముగా, కోటగా నిలుచును
ఏ అపాయం రాకుండా కాపాడును
“హోసన్నా జయం ఎల్లవేళల విజయమే
హోసన్నా జయం ఘనపరచెద రారాజునే”
1.శ్రమలన్నిటిలో విడిపించి గొప్పచేయును
తన రక్షణ మనకు చూపించి స్థిరపరచును
యెహోవా మహిమ మనపై ఉదయించెను
వెలిగెదం యేసుకై ప్రకాశించెదం
2.పరిశుద్ద పట్టణమున మనలను చేర్చుటకు
పరిశుద్దుడైన యేసు-తిరిగి రానైయుండెను
పవిత్ర జీవితం పరిశుద్ధాత్మను కలిగి
బ్రతికెదం నిరీక్షణతో సాగెదం