
Anaganaga Oka Oorundi – అనగనగా ఒక ఊరుంది
అనగనగా ఒక ఊరుంది ఆ ఊరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని యింట మరియమ్మను కన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్నియ గర్భములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసయ్యంట ఓరయ్యా……దేవ దూత సెలవిచ్చాడు వినవాయ్యా
తూరుపంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతోంది చూడు
చీకటింక మాయం పాపమంత దూరం
చిన్ని యేసు జగతికింక నేస్తం……..
శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటాయే బ్రతుకు భారమాయే
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం
రక్షకుండు నేడు పుట్టినాడు……..