అంబరాన్ని దాటే సంబరాలు నేడు
నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు || 2 ||
రండయ్యో రండి రండి దావీదు పురముకు || 2 ||
రారాజు పుట్టి ఇలా పిలిచెను కొలువుకు || 2 ||
దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము
ఏకైక తనయుని పంపెను ఈ దినము || 2 ||
పశువుల పాకలో ఒదిగేను శిశువుగా || 2 ||
అవతరించే నేడు లోక రక్షకునిగా || 2 || || రండయ్యో ||
దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ
శాపాలు, పాపాలు రద్దయిన శుభవేళ || 2 ||
లోకాల కారకుడు లోకమున పుట్టెను || 2 ||
మనిషి మరణము ఆయువు తీరెను || 2 || || రండయ్యో ||