Aakasham Vypu – ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను

Deal Score+1
Deal Score+1

Aakasham Vypu – ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను

పల్లవి: ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను
నా సహాయకుడవు నీవే యేసయ్యా”2″
కలవరము నొందాను నిన్ను నమ్మి యున్నాను”2″
కలత నేను చెందను
కన్నీళ్లు విడువను”2″ (ఆకాశం)

  1. ఆకాశం పై నీ సింహాసనం ఉన్నది
    రాజ దండముతో నన్నేలుచున్నది”2″
    నీతిమంతునిగా చేసి నిత్యజీవము అనుగ్రహించితివి”2″
    నేనేమైయున్నానో అది నీ కృపయే కదా “2” (ఆకాశం)
  2. ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు
    ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు”2″
    నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి “2”
    నీవు ఉండగా ఈ లోకంలో ఏదియు
    నాకు అక్కర లేనే లేదయ్యా”2″ (ఆకాశం)
  3. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యున్నది
    అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది”2″
    నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి “2”
    కృపాసనముగా నన్ను మార్చి నాలో
    నిరంతరం నివసించితివి”2″ (ఆకాశం)
  4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది”2″
    భాష లేని మాటయే నీ స్వరమే వినపడనిది”2″
    పగలు బోధించుచున్నది
    రాత్రి జ్ఞానమిచ్చుచున్నది”2″ (ఆకాశం)
  5. కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము
    నాకై నిర్మించుచున్నావు “2”
    మేఘ రథములపై అరుదించి నన్ను కొనిపోవా”2″
    ఆశతో వేచియుంటిని
    త్వరగా దిగి రమ్మయ్య”2″ (ఆకాశం)
    Jeba
        Tamil Christians songs book
        Logo