Ee Neela Neththutitho – ఈ నేల నెత్తుటితో Telugu Christian Song lyrics in English. Written Tune, Music & Voice : Dr. A.R.Stevenson.
ఈ నేల నెత్తుటితో తడిచేనా – ఆ తల్లి హృదయం వగచేనా
రాజైన యేసయ్యా – నీ కెంత బాధయ్యా
నా పాప శాపం సిలువై నిను వేదించేనా
- త్యజియించినావు ఆ సౌఖ్యం – దిగివచ్చినావు నా కోసం
నాకిచ్చినావు నీ సర్వం – వర్ణించలేను నీ త్యాగం
నా శిక్షయేగా నీ సిల్వమరణం – విడిపించినావయ్యా - ఏ దోషం లేనిది నీ కాయం – అయినా ఎందుకు ఆ గాయం
నీవు నిలిచింది నా స్థానం – నాకై విడిచావు నీ ప్రాణం
వెలలేనిదయ్యా నీ శుద్ధ రుధిరం – నను కడిగినావయ్యా - భరియించినావు నా శాపం – క్షమియించినావు నా పాపం
సహియించినావు ఆ ఘోరం – తొలగించినావు నా భారం
విలువైనదయ్యా కల్వరి యాగం – నే మరువలేనయ్యా
Ee Neela Neththutitho Song Lyrics in English
Ee Neela Neththutitho
Lyrics,Tune, Music & Voice : Dr. A.R.Stevenson.
Symphony Music.