Yajamanuda new year song lyrics – యజమానుడా

Deal Score0
Deal Score0

Yajamanuda new year song lyrics – యజమానుడా

పల్లవి:
ఫలించెడి కొమ్మగా చేసినావయా
నీటి యోరన నన్ను నాటినావయా! “2”
యజమానుడా! నా వ్యవసాయకుడా! “2”
నీ తోటలోనే నాటితివి అంచెలంచెలుగా
దీవించితివి”2″

  1. బబులోను దేశమందు దానియేలును
    దీవించితివి నీవు ఘనపరచితివి “2”
    చెరలోనుంది విడిపించితివి,
    నీ దాసుని పక్షముగా నిలచితివి “2”
  2. ఐగుప్తు దేశమందు యేసేపును
    దీవించితివి నీవు ఘనపరచితివి “2”
    గోతిలోనుంది లేపితివి,
    నీ దాసుని తలను పైకెత్తితివి “2”
  3. నీ దాసుడైన అబ్రహామును
    దర్శించితివి వృద్ధి చేసితివి “2”
    సంతానమునిచ్చి దీవించితివి,
    విశ్వాసులకు తండ్రిగా మార్చితివి “2”
    Jeba
        Tamil Christians songs book
        Logo