Parvatha prasangikhuda – పర్వత ప్రసంగికుడా
Parvatha prasangikhuda – పర్వత ప్రసంగికుడా
పర్వత ప్రసంగికుడా – పుణ్యమూర్తి యేసయ్య
పూర్వకాలం నుండే పూజింపబడుచున్న
అపురూప దివ్య దైవమా (2)
యేసు అపురూప దివ్య దైవమా
అ.ప. నీ సానిధ్యమే మా ప్రాణాలకు ఆధారం
నీదు వాక్యమే మా జీవాత్మకు ఆహారం
ఆరోగ్యప్రదాత ఆరాధిస్తా నిన్నే (2)
- ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని
కొండ మీద చేసిన మీ ప్రభోదమే
ఆత్మీయులకే కొండంత ధైర్యం నింపెనయ్య దేవాప్రభో (2)
తరాలు మారిన (నీ) అంతరంగమే మారని –
జీవ తరంగమా యేసూ మా తండ్రి
॥ నీ సానిధ్యమే॥ - నీతి విషయమై హింసించబడు వారు ధన్యులని
పరలోక రాజ్యము వారిదేనని
నీ వారికందరికి జీవమార్గం చూపి నడిపెనయ్య ఈ లోకంలో
మార్గము సత్యము జీవము నీవయ్య (2)
వాక్య ప్రవాహమా (మా) పరలోకపు తండ్రి
॥నీ సానిధ్యమే॥
3.విలవెల లాడె – కానా పెండ్లి విందు ద్రాక్షారసముకై
కళకళ లాడెను యేసయ్య మాటతో కళ్యాణమే
అంతులేని ఆనందం మార్త మరియలు పొందిరయ్య
లాజరు యొక్క పునర్జన్మతో (2)
ఇలలో కలలో యేసయ్యతోనే (2)
వికసించే నా సరికొత్త సంబరం
॥ నీ సానిధ్యమే॥