Naa Janulainavaarevaru – నా జనులైనవారెవరు

Deal Score+1
Deal Score+1

Naa Janulainavaarevaru – నా జనులైనవారెవరు

నా జనులైనవారెవరూ నాశనమునకు పోవలదు
భారతదేశ ప్రజలెవరూ ఉగ్రతబారిన పడవలదు
అ.ప. : దీవించుము దీవించుము భారతదేశాన్ని
రక్షించుము రక్షించుము నాదేశ జనాంగాన్ని

  1. నా రక్తసంబంధులు ఇంటను ప్రేమపంచువారు
    నేడు నాలో భాగమైయున్నవారు
    ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను
    రేపు ఆరని అగ్నిలో వేదనపడుట నేనెట్లు భరించను
  2. నాకున్న స్నేహితులు బాధలో ఆదరించువారు
    నేడు వెంటే ఆప్తులైయున్నవారు
    ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను
    రేపు ఆ నరకములో ప్రలాపించుట నేనెట్లు సహించను
  3. నా చుట్టుఉన్నవారు నవ్వుతూ పలకరించువారు
    నేడు ఎంతో సాయమైయున్నవారు
    పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించను
    రేపు పాతాళములో పండ్లుకొరుకుట నేనెట్లు ఊహించను

నా జనులైనవారెవరు
నాశనమునకు పోవలదు
Naa Janulainavaarevaru
Naashanamunaku Povaladhu

    Jeba
        Tamil Christians songs book
        Logo