దావీదులా క్రొత్త కీర్తనలతో – Dhaveedhula krotha keerthanalatho

Deal Score0
Deal Score0

దావీదులా క్రొత్త కీర్తనలతో – Dhaveedhula krotha keerthanalatho

దావీదులా క్రొత్త కీర్తనలతో
గానం స్తుతిగానం చేసెదను,
ఆ దావీదులా క్రొత్త కీర్తనలతో
గానం స్తుతిగానం చేసెదను..
నిత్యం నీలో ఆనందించి దివారాత్రులు నే ధ్యానించి 2
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను (దావీదు

1) నా జీవితములో పొందిన మేలులు తలంచి ,నేను తలంచి..హృదయ సీమలో నీవే కొలువుండి మనస్సులో నెమ్మదినిచ్చి
నీ పాటలతో నేను పరవశించెదా 2
శతకోటి పాటలే నేను పాడిన నా ఆశ తీరదులే 2
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను (దావీదు

2) అప జయములలో, కృంగిన వేళలో వెన్నంటి ధైర్యమునిచ్చి…
ఒంటరి పయనంలో నీవే తోడుండి,తీరమున నను చేర్చి 2
నీ నామమునే నేను స్మరణ చేసదా 2
ప్రతికూలమైన పరిస్తితిలోను నా గానం ఆగదులే 2
కీర్తనియ్యుడా నిను కీర్తించెదను
ప్రాణనాథుడా నిను ప్రేమించెదను 2

    Jeba
        Tamil Christians songs book
        Logo