Naa Deshamunu – నా దేశమును

Deal Score+1
Deal Score+1

Naa Deshamunu – నా దేశమును

నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2)
నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)

కానను పయనములో మోషేను నడిపితివి
అద్భుతాలు చేషి గమ్యము చేర్చితివి (2)
ఫరో సైన్యము మమ్ము తరుముచుండగా
ఎర్ర సముద్రము ఎదురు వుండగా (2)
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2)
నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)

సౌలును పౌలుగా మార్చి నీ సేవకై నడిపితివి
నా ప్రజలా జీవితము మార్చుము దేవా (2)
చెరసాలలో వేసిన బయ పడకా
అగ్నిగుండము ఐనా వెను దిరగక (2)
నీతోనే నీలోనే నిలుచుండె బలమిమ్ము (2)
నా దేశమును కాపాడుమయ్యా
నా ప్రజలనూ నీకై నిలుపుమయ్యా (2)

Jeba
      Tamil Christians songs book
      Logo