7 Rangulu – ఏడురంగుల ఇంద్రధనస్సు తోడు ఇచ్చే రా

ఏడురంగుల ఇంద్రధనస్సు తోడు ఇచ్చే రా…
ఏమి కాదు అంటూ మాట సెలవు ఇచ్చే రా…
నువ్వు నమ్ముకున్న తండ్రి చేయి విడచునా…
మాట తప్పనని నీకు సెలవిచ్చెరా…

హోరు గాలు లొచ్చినా, జడి వాన లొచ్చినా
వరద ముంచుకొచ్చినా, నీ చెయ్యి విడచునా (2)

రెప్పపాటు జీవితమిది అడుగడుగునా గండమున్నది
మాట నువ్వు పలికినచో కాటు అయి తిరిగొస్తుంది
సాయమే నువ్వు కోరినా గాయమేగా మిగిలున్నది
న్యాయమే నువ్వు అడిగినా అన్యాయమేగా పొంచియున్నది

మృత్యు ముందరున్నది, ముప్పు తరుముతున్నది,
ప్రేమ దూరం అయ్యింది, శాంతి కరువు అయ్యింది (2)

మారుచున్న ఈకాలం, దారితీస్తోంది నీ మరణం
తెలుసుకో నేస్తం, మార్చుకో నీ జీవితం
నీకై ప్రాణం పెట్టినా, నీ తండ్రికి మొఱపెట్టుకో
ఆ పై సిల్వ రక్తముచే నీ పాపాన్ని నువ్వు కడుగుకో

నిత్య జీవమొచ్చును, మోక్ష మార్గమొచ్చును
ప్రేమ నీకు దొరుకును, శాంతి నీకు కలుగును (2)
|| ఏడు రంగుల ||

Tags:

We will be happy to hear your thoughts

      Leave a reply