భారమైన సిలువను భరియించితివా – Bharamaina Siluvanu Bhariyincitiva

Deal Score0
Deal Score0

భారమైన సిలువను భరియించితివా – Bharamaina Siluvanu Bhariyincitiva

పల్లవి:

భారమైన సిలువను భరియించితివా
నాపాప భారమంతా తొలగించితివా
క్షమియించితివా విమోచించితివా
నీ రక్తముతో నన్ను కడిగియుంటివా.

చరణం:

1.యూదుల రాజానీకు శుభమని చెప్పి
అరచేతులతో నిన్ను కొట్టినా . (2సార్లు)

మౌనివైతివా మాట్లాడకుంటివా
నాకు బదులుగా శిక్షింపబడితివవా. (2సార్లు)

చరణం:

2. సర్వ భూమికి మహారాజువైన నీకు
ముల్లకిరీటం గుచ్చుతున్నా. (2సార్లు)

[ మౌనివైతివా ]

చరణం:

3.పాపుల నడుమ పాపరహితుడైన నిన్ను
సిలువకు కొట్టి వ్రేలడ దీసినా. (2సార్లు)

[ మౌనివైతివా ]

చరణం:

4.నీపై వస్త్రము తీసి పంచుకొనినా
అంగీకొరకు చీట్లు వేసినా. (2సార్లు)

[ మౌనివైతివా ]

Jeba
      Tamil Christians songs book
      Logo