నాకై ధీనునిగా భువికి వచ్చినావయా – Dheendu Telugu worship song

Deal Score0
Deal Score0

నాకై ధీనునిగా భువికి వచ్చినావయా – Dheendu Telugu worship song

నాకై ధీనునిగా భువికి వచ్చినావయా
పశువుల పాకలో పుట్టిన యేసయ్య
దివా రాత్రములు స్తుతికి అర్హుడ నీవయా
స్థిరమైన ఇల్లు నీకు లేకుండెనా
ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే
నక్కలకు బొరియలుండే
మనుష కుమారునికి స్థలమే లేకుండెనే
భూమి పునాదులు వేసిన వానికి
సృష్టినంతటిని చేసిన వానికి
పశువుల పాకే మిగిలెనే

ఐనా నీవు తిరిగి వెళ్ళలేదయ్యా
ఐనా నీవు విడచి వెళ్ళలేదయ్యా
మాతో నివసించినావయా

కన్నీటిని తుడిచే దైవమా
కిరీటము విడచినావుగా
కృంగి పడిన వేళలో
కదలి వచ్చినావయా
నలిగిన రెల్లును విరువవు
నీ ప్రేమతో చేర్చుకొందువు
అనాధగా ఎన్నడు విడువవు
ఆధారం నీవై యుందువు

రాజువైనను రథమును కోరలేదయా
సామాన్యునిగా మాతో నడచితివే
రాజులందరు రాజ నగరిలో ఉండగా
నీవు వీధులలో మాతో నడచితివే
నీవు రాజువని నిన్ను పొగడక
నీకు పాపియని పేరిచ్చిరే
అది ఊరు వాడా ప్రకటించుచు వచ్చిరే
నీవు రోగులను స్వస్థపరచినా
దురాత్మలను వెళ్ళగొట్టినా
నిన్ను దయ్యము పట్టిన వాడని పిలచిరే

ఐనా వీధులలో మాతోనే నడచితివే
ఐనా ఆపక ప్రేమను మాపై చూపితివే
మా మధ్యలో కదలిన దైవమా

గ్రుడ్డివారు చూపును పొందిరే
కుంటివారు నడువ సాగిరే
మూగవారు నిన్నే పాడుచు
నీ కార్యమునే వివరించిరే
తుఫాను నిలచిపోయెనే
సంద్రము నిర్మలమాయెనే
శాశ్వత ప్రేమకు సమస్తము
సాధ్యమని పాడిరే

కన్నీటిని తుడిచే దైవమా
కిరీటము విడచినావుగా
కృంగి పడిన వేళలో
కదలి వచ్చినావయా
నలిగిన రెల్లును విరువవు
నీ ప్రేమతో చేర్చుకొందువు
అనాధగా ఎన్నడు విడువవు
ఆధారం నీవై యుందువు

Jeba
      Tamil Christians songs book
      Logo