కరుణాసాగరా – Karunasaagara
కరుణాసాగరా – Karunasaagara
కరుణా సాగర యేసయ్య
కనుపాపగ నను కాచితివి ||2||
ఉన్నతమైన ప్రేమతో
మనసున మహిమగ నిలిచితివి ||2||
//కరుణా సాగర//
మరణపు లోయలో దిగులు చెందగ
అభయము నొందితి నిను చూసి
దాహము తీర్చిన జీవనదీ
జీవా మార్గము చూపితివి
//కరుణా సాగర//
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమతో నింపితివి
ఒదిగితినీ నీ కౌగిలిలో
ఓదార్చితివీ వాక్యము తో
//కరుణా సాగర//
అక్షయ స్వాస్త్యము నే పొందుటకు
సర్వ సత్యంములో నడిపితివి
సంపూర్ణ పరచి జ్యేస్టులతో
ప్రేమా నగరిలో చేర్చుమయా
//కరుణా సాగర//
#అల్లి. అన్నారావు#